: అద్భుతంగా ఆడాం...బ్యాటింగ్ లో మెరుగవ్వాలి: రహానే


కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే కితాబిచ్చాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీట్వంటీలో పది పరుగుల తేడాతో ఓటమి పాలైన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటమి నిరాశకు గురిచేసిందని అన్నాడు. అయితే వన్డే, టీట్వంటీ సిరీస్ లో ఆటగాళ్లంతా ఉత్తమ ప్రదర్శన చేశారని అభినందించాడు, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ లు సెంచరీలు చేయడం శుభసూచకమని పేర్కొన్న రహానే, విజయ్, తాను అర్ధ సెంచరీలతో రాణించామని పేర్కొన్నాడు. అయినప్పటికీ బ్యాటింగ్ లో మరింత మెరుగుపడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. రెండో టీట్వంటీలో జింబాబ్వే అద్భుతంగా ఆడిందని రహానే తెలిపాడు. కాగా, వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, టీట్వంటీ సిరీస్ ను ఒక విజయం, ఒక ఓటమితో సమం చేసింది.

  • Loading...

More Telugu News