: ఆర్థిక లోటు ఉంటే పుష్కరాలకు ఎలా ఖర్చు చేస్తున్నారు?: చంద్రబాబును ప్రశ్నించిన వామపక్షాలు
రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచమనడం సరికాదని వామపక్షాలకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర పరిస్థితిని కార్మికులు, ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని కోరారు. మరి రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంటే పుష్కరాలకు వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. కార్మికుల జీతాలు పెంచేవరకూ పోరాడతామని సీఎంకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చంద్రబాబు ఈరోజు విజయవాడలో విపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన వామపక్ష నేతలు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఎంకు సూచించారు. వేతనాల పెంపుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ నెల 22న కార్పొరేషన్ కార్యాలయాల ముట్టడి చేపట్టనున్నట్లు నేతలు పిలుపునిచ్చినట్టు చెప్పారు.