: పిల్లలకు చదువుపై ఆసక్తిని పెంచేందుకు నందన్ నిలేకని తెచ్చిన 'ఏక్ స్టెప్ జీనీ'
ప్రాథమిక విద్యా విధానంలో మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సులు (ఎంఓఓసీ) ప్రవేశపెట్టే దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని భావిస్తూ, సుమారు సంవత్సరం పాటు శోధించి రూపొందించిన 'ఏక్ స్టెప్ జీనీ' మెటా-యాప్ సేవలందించేందుకు సిద్ధమైంది. యూఐడీఏఐ చైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ నందన్ నిలేకని టీమ్ ఈ యాప్ ను సృష్టించింది. ఇందులో చిన్నారులకు విద్యపై ఆసక్తిని కలిగించే ఎన్నోరకాల గేమిఫైడ్ యాప్స్ ఉంటాయని తెలుస్తోంది. గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తరువాత నందన్ నిలేకని తన మెదడుకు పదును పెట్టి ఈ యాప్ ను తయారు చేయించారని, ఆయన ముఖ్య అనుచరుల్లో ఒకరైన శంకర్ మారువాడ, సతీమణి రోహిణిలు సహాయపడ్డారని తెలిసింది. ఎంతో మంది చిన్నారులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నప్పటికీ, చాలా మందికి విద్యాభ్యాసంలో సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు 'ఏక్ స్టెప్ జీనీ' ఉపకరిస్తుందని శంకర్ మారువాడ తెలిపారు. ఇది ప్లేస్టోర్ లో ప్లేస్టోర్ లా పనిచేస్తుందని వివరించారు. ఇందులోని ప్రతి యాప్ కరికులమ్ తో మిళితమై ఉంటుందని, వీటిని పాఠశాలలు, తల్లిదండ్రులు, ట్యూషన్లు చెప్పే టీచర్లు వాడవచ్చని ఆయన తెలిపారు.