: బోనాల పండుగకు రూ. 10 కోట్లు కేటాయించిన టీఎస్ ప్రభుత్వం
బోనాల పండుగపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు నాయిని, తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, సీపీ మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా, దేవాలయాల వద్ద బోనాల పండుగ ఏర్పాట్లు చేసేందుకు రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇందులో దేవాదాయ శాఖ నుంచి రూ. 5 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి రూ. 5 కోట్లు కేటాయిస్తారు.