: అందరూ కలిసి జగన్ ను కాంగ్రెస్ లోకి తీసుకువస్తారు: గాలి ముద్దుకృష్ణమ


విపక్షాలపై టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. పనికిమాలిన ప్రతిపక్షాలు దొరకడం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ కుట్ర రాజకీయాలకు తెరదీసి, తెలుగుదేశం పార్టీని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి వైఎస్సార్సీపీలోకి వెళతారని, అందరూ వెళ్లి జగన్ ను కాంగ్రెస్ లోకి తీసుకువస్తారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా త్వరలో వైఎస్సార్సీపీలోకి వెళతారని ముద్దుకృష్ణమ తెలిపారు. ఇక, రాహుల్ ఏపీలో పర్యటించనుండడంపైనా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు తక్కువగానే చోటుచేసుకున్నాయని, అలాంటప్పుడు ఆయన రాష్ట్రంలో ఎందుకు పర్యటించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వేలమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డా సోనియా గాంధీ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు రైతులపై ఉన్నట్టుండి ప్రేమ కురిపించడం వెనుక కారణమేంటని నిలదీశారు.

  • Loading...

More Telugu News