: ఢిల్లీలో స్మగ్లర్ల స్థావరాల్లో కడప పోలీసుల తనిఖీలు... అదుపులో అంతర్జాతీయ స్మగ్లర్


కడప జిల్లా పోలీసులు ఈరోజు ఢిల్లీలో ఎర్రచందనం స్మగ్లర్ల స్థావరాలపై దాడి చేశారు. ఈ సమయంలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ పింకూశర్మను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే అతన్ని కడపకు తీసుకువచ్చారు. జిల్లా నుంచి విలువైన ఎర్రచందనాన్ని ఢిల్లీకి తరలించి ఆపై నేపాల్, చైనా, బర్మా, జపాన్ దేశాలకు విక్రయించారని పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీ, హర్యానా, యూపీ కేంద్రాలుగా పింకూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని పోలీసులు తెలిపారు. మూడురోజుల కిందట హర్యానాలో జయపాల్ సింగ్ అనే స్మగ్లర్ ను, గత నెలలో మరికొంతమంది స్మగ్లర్లను కూడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News