: అమెరికాలో నిర్మాణంలో ఉన్న హిందూ దేవాలయంపై కాల్పులు


అమెరికాలోని నార్త్ కరోలినాలో ప్రతిపాదిత హిందూ దేవాలయాన్ని సూచిస్తూ పెట్టిన బోర్డుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానిక హిందూ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేవాలయం బోర్డుపై షాట్ గన్ తో 60 రౌండ్ల కాల్పులు జరిగాయని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఫోర్సిత్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఖాళీగా ఉన్న తూటాల షెల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అనుమానించ లేదని వివరించారు. కాగా, నార్త్ కరోలినాలోని 'ఓమ్' సంస్థ 7.6 ఎకరాల భూమిని కొని, అందులో 3,600 చదరపు అడుగుల విస్తీర్ణంగల దేవాలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ ఘటనతో తాము వెనకడుగు వేయబోమని, ప్రణాళికల ప్రకారమే నిర్మాణాన్ని చేపడతామని 'ఓమ్' ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ పెంచారని వివరించింది.

  • Loading...

More Telugu News