: కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ... ఏడుగురికి గాయాలు


కృష్ణా జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నందివాడ మండలం రామాపురంలో చోటుచేసుకున్న ఈ గొడవలో ఒకరిపైకి మరొకరు దూసుకురాగా ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, ఇరు వర్గాలను అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వివాదానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News