: రాజమండ్రి చేరుకున్న మంత్రి ఈశ్వరన్ బృందం


సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం కొద్దిసేపటి కిందట తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, అధికారులు ఈశ్వరన్ బృందానికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఈశ్వరన్, చంద్రబాబు ఒకే కారులో షెల్టన్ హోటల్ కు బయలుదేరి వెళ్లారు. తరువాత రాజధాని ముఖ్యప్రాంత బృహత్తర ప్రణాళికను సీఎంకు అందజేస్తారు. సాయంత్రం 4 గంటలకు సీఎం, ఈశ్వరన్ సంయుక్త మీడియా సమావేశం ఉంటుంది. ఇక రాజమండ్రిలో ఈ సాయంత్రం జరగనున్న గోదావరి హారతి కార్యక్రమంలో ఈశ్వరన్ పాల్గొంటారు.

  • Loading...

More Telugu News