: గోదావరి మధ్యలో నిలిచిపోయిన మంత్రుల బోటు... మెకానిక్ సమయస్ఫూర్తితో ఊపిరిపీల్చుకున్న అధికారులు!


తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా కొనసాగుతున్న తన్నీరు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ లు నిన్న గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు వారు బయలుదేరిన బోటు నది మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో నదికి రెండు వైపులా ఉన్న అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే బోటులోని మెకానిక్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. నిన్న ఆదిలాబాదు జిల్లా లక్సెట్టిపేట వద్ద పుష్కరాలను పరిశీలించేందుకు వెళ్లిన హరీశ్, రాజేందర్ లు గోదావరికి ఆవలివైపు ఉన్న కరీంనగర్ జిల్లా మంచిర్యాల సమీపంలోని కోటి లింగాల పుష్కర ఘాట్ ను సందర్శించేందుకు బోటులో బయలుదేరారు. నది మధ్యలోకి వెళ్లగానే సాంకేతిక లోపం కారణంగా బోటు నిలిచిపోయింది. అయితే బోటులోనే ఉన్న మెకానిక్ మరమ్మతు చేయడంతో తిరిగి బోటు కదిలింది. మంత్రులిద్దరూ క్షేమంగా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News