: అమరావతి ప్రణాళికతో హైదరాబాదు చేరుకున్న సింగపూర్ బృందం... మరికాసేపట్లో రాజమండ్రికి పయనం
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రణాళిక సిద్ధమైపోయింది. మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి చేతికి సదరు ప్రణాళిక అందనుంది. నవ్యాంధ్ర రాజధాని ప్రణాళికను రూపొందించిన సింగపూర్ ప్రతినిధి బృందం ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో నేటి తెల్లవారుజామున హైదరాబాదు చేరుకుంది. మరికాసేపట్లో సదరు బృందం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ప్రత్యేక విమానంలో బయలుదేరనుంది. అక్కడ పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం చేసిన అనంతరం రాజధాని ప్రణాళికను చంద్రబాబు చేతిలో పెట్టనుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.