: టీమిండియాను చిత్తు చేసిన జింబాబ్వే... సిరీస్ సమం


హరారేలో జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు పరాభవం ఎదురైంది. భారత్ పై జింబాబ్వే 10 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. తమ ముందున్న 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాట్స్ మన్ దారుణంగా విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. రాబిన్ ఊతప్ప (42), మధ్యలో స్టువర్ట్ బిన్నీ (24), సంజు శాంసన్ (19) మినహా ఇతర బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేకపోయారు. దీంతో, స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక భారత్ ఓటమిపాలయింది. మిగిలిన బ్యాట్స్ మెన్ లలో రహానే (4), విజయ్ (13), పాండే (0), జాదవ్ (5), అక్షర్ పటేల్ (13), భువనేశ్వర్ కుమార్ (9) పరుగులు చేశారు. మోహిత్ శర్మ (3), సందీప్ శర్మ (1) నాటౌట్ గా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో క్రెమర్ 3 వికెట్లు తీయగా, ముజరబాని, పోఫు, విలియమ్స్ చెరో వికెట్ పడగొట్టారు. ముగ్గురు భారత బ్యాట్స్ మెన్ రనౌట్ అయ్యారు. చివరి 5 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News