: కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన తెలంగాణ ఉద్యమ వేదిక


తెలంగాణకు ఎంతో ఉపయుక్తమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ను మార్చాలన్న టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ తప్పుబట్టారు. కేసీఆర్ నిర్ణయంతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల డిజైన్ మార్పులకు సంబంధించి ప్రజల్లో చర్చ జరగాలని అన్నారు. డిజైన్ మార్పుపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ముంపు ప్రాంతాన్ని కూడా కచ్చితంగా గుర్తించాలని అన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన సర్వే పనులను 'వ్యాప్కోస్' సంస్థకు అప్పగించడంపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. గోదావరి నీటి వినియోగంపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని... నీటి విడుదలకు సంబంధించిన వాస్తవాలను ముఖ్యమంత్రి ప్రజలకు తెలపాలని కోరారు.

  • Loading...

More Telugu News