: ఎన్నికల ప్రచారం చేసేందుకు భారత సంతతి మహిళ తీసుకుంటున్న జీతం రూ. కోటీ 75 లక్షలు


హుమా అబేదిన్... అమెరికాలోని భారత సంతతి మహిళ. ఆమె జీతం ఏడాదికి రూ. కోటీ 75 లక్షలు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ తరపున ప్రచారం చేస్తున్నందుకు ఆమె అందుకుంటున్న వేతనం ఇది. గత 20 ఏళ్లుగా హిల్లరీ క్లింటన్ వద్ద ఆమె పని చేస్తున్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలలకు గాను ఆమె అందుకున్న వేతనం రూ. 44 లక్షలు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... హిల్లరీ తరపున ప్రచారం చేసే బృందం మేనేజర్ జాన్ పొడెస్టా అందుకుంటున్న జీతం కేవలం రూ. 17 లక్షలే. అవసరమైతే సొంతంగా ప్రచారం చేయగల సత్తా ఉండటమే హుమా స్పెషాలిటీ. హుమా తండ్రి సయ్యద్ జైనుల్ అబేదిన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు.

  • Loading...

More Telugu News