: చంద్రబాబు నిర్వాకం వల్లే 32 మంది దుర్మరణం: ఉమ్మారెడ్డి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్లే 32 మంది అమాయక భక్తులు దుర్మరణం పాలయ్యారని వైకాపా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. రాజమండ్రిలోని కోటగుమ్మం ఘాట్ లో చంద్రబాబు ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ తెలిపారని ఆయన అన్నారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారని చెప్పిన తర్వాతే అక్కడ నుంచి చంద్రబాబు వెళ్లిపోయారని తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కూడా తన నివేదికలో పేర్కొన్నారని చెప్పారు. అయితే, ఎస్పీపై ఒత్తిడి తెచ్చి తాను ఇలా చెప్పలేదని చెప్పించే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు.

  • Loading...

More Telugu News