: ఆండ్రాయిడ్ యూజర్లు తెలుసుకోవాల్సిన 10 టిప్స్
మొబైల్ ఆపరేటింగ్ ప్లాట్ ఫాంగా కోట్లాది మంది అరచేతుల్లోకి చేరిపోయిన ఆండ్రాయిడ్ వ్యవస్థను అత్యంత సులభంగా ఎవరికి వారు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సులభంగా పర్సనలైజ్ చేసుకోవడంతో పాటు అధిక బ్యాటరీ మన్నిక కోసం 10 టిప్స్ ఇవి. *ముందుగా ఆండ్రాయిడ్ ను అందించిన గూగుల్ కు కృతజ్ఞతలు చెప్పి, గూగుల్ యాప్ ఓపెన్ చేసి 'గెట్ గూగుల్ నౌ' క్లిక్ చేసి పర్సనలైజ్ చేసుకోవాలి. దీని వల్ల అవసరం లేని నోటిఫికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. *ఒకే రకమైన విడ్జట్స్ చూస్తుంటే బోర్ కొడుతుంది. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న వేలాది విడ్జట్స్ నుంచి నచ్చినవి ఎంచుకొని వాటిని లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ అనుభూతిని మరింత ఆహ్లాదకరం చేసుకోవచ్చు. *సెట్టింగ్స్ లోని పవర్ సేవింగ్ మోడ్ ను ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉంచడం ద్వారా అధిక బ్యాటరీ మన్నిక సాధ్యమవుతుంది. వెలుగులో ఉన్న సమయంలో బ్రైట్ నెస్ పెంచుతూ, చీకటి పెరిగే కొద్దీ స్క్రీన్ కాంతిని ఇవి తగ్గిస్తుంటాయి. కొన్ని స్మార్ట్ ఫోన్లలో అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంటుంది. *దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లూ బ్యాటరీని త్వరగా తినేసేవే. ఈ నేపథ్యంలో ప్రయాణాల్లో ఉన్న సమయంలో మరో బ్యాటరీ లేదా పవర్ బ్యాంకును వెంట ఉంచుకోవడం ఉత్తమం. *క్రోమ్ బ్రౌజర్ ద్వారా గూగుల్ ఖాతాలో సైనిన్ అయితే, మీ బుక్ మార్క్స్, ఇతర ప్రిఫరెన్సులు వాటంతట అవే స్మార్ట్ ఫోన్ కు అందుబాటులోకి వస్తాయి. *వివిధ యాప్స్ ను విభజించుకునేందుకు కొన్ని ఫోల్డర్లను క్రియేట్ చేసుకుంటే మంచిది. దీనివల్ల మరింత సులువుగా, వేగంగా యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. *ఆండ్రాయిడ్ వ్యవస్థ అందించిన మరో వరం 'లెటర్ స్వైపింగ్'. పెద్ద వాక్యాలను టైప్ చేయడం కన్నా స్వైప్ చేయడం సులువు. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్లో పలు రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా వాడకాన్ని తగ్గించుకునేందుకు ఈ సిస్టమ్ లో అవకాశాలున్నాయి. ఇమేజ్ లను చిన్న సైజ్ లోకి మార్చడం, అవసరం లేని యాప్స్ ను ఎప్పటికప్పుడు ఆపివేయడం వంటివి సులువుగా చేసుకోవచ్చు. *వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు గూగుల్ రెండు రకాల సెక్యూరిటీ పద్ధతులను అవలంబిస్తోంది. గూగుల్ ఖాతాలో సైనిన్ కావడానికి ఓ వెరిఫికేషన్ కోడ్ ను పంపే సదుపాయాన్ని ప్రారంభించింది. దీని వల్ల ఇతరులు మీ ఖాతాలోకి ప్రవేశించే అవకాశాలు ఉండవు. *మీ ఫోనులో డీఫాల్ట్ బ్రౌజర్ ను ఒక్క క్లిక్ తో మార్చుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి 'క్లియర్ డీఫాల్ట్స్'ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.