: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సాకర్ దిగ్గజం పీలే
ప్రముఖ సాకర్ దిగ్గజం, బ్రెజిల్ కు చెందిన పీలే (74) తీవ్ర వెన్ను నొప్పితో ఆసుపత్రిలో చేరారు. శావ్ పావులో లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు వెన్ను పూస సంబంధిత శస్త్ర చికిత్స జరుగుతోందని మీడియా సంస్థ 'టీవీ గ్లోబో' వెల్లడించింది. గతంలో ఆయనకు జరిగిన ఓ ఆపరేషన్ కారణంగా, వెన్నుపూసకు చెందిన ప్రధాన నాడీవ్యవస్థపై ఒత్తిడి పెరిగి, ఆయన నొప్పిని ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం పరిస్థితి అంత తీవ్రంగా ఏమి లేదని వైద్యులు తెలిపారు. మరో 24 గంటల పాటు ఆయనను వైద్యుల పరిశీలనలో ఉంచనున్నట్లు తెలిపారు.