: 'బాహుబలి-2' ఇంకా అద్భుతంగా ఉంటుంది: ప్రభాస్


'బాహుబలి-ది బిగినింగ్'తో పోలిస్తే రెండో భాగం రెండు రెట్లు అద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు హీరో ప్రభాస్. తమిళనాట చిత్రం విజయవంతమైన నేపథ్యంలో బాహుబలి బృందం మీడియాతో ముచ్చటించింది. సుమారు మూడేళ్లు తాము పడ్డ శ్రమను ఇప్పుడు మరచిపోయామని ఆయన అన్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న స్పందన తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని, అభిమానులతో పాటు తాను సైతం రెండవ భాగం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. సెకండ్ పార్ట్ కు సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే మిగతా చిత్రీకరణను పూర్తి చేస్తామని వివరించాడు. ఈ కార్యక్రమంలో జ్ఞానవేల్‌ రాజా, రమ్యకృష్ణ, రాజేష్, సీవీ కుమార్, జీవీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News