: పుష్కరాలకు ప్రధాని రారట!
గోదావరి పుష్కరస్నానం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశాలు లేవని ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉన్న కారణంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగరాదనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని వివరించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన నేటి నుంచి విజయవాడ - విశాఖ మార్గంలోని అన్ని టోల్ ప్లాజాల్లో ఫీజులను ఎత్తివేశామని ఆయన తెలిపారు. ఈ ఉత్తర్వులను పాటించకుంటే టోల్ గేట్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లక్షలాదిగా తరలివస్తున్న పుష్కర యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లూ చేశామని తెలిపారు.