: 2020 నాటికి హిందూదేశంగా భారతావని: సాయిబాబా చెప్పారంటున్న అశోక్ సింఘాల్


మరో ఐదేళ్లలో భారతదేశం హిందువుల దేశంగా నిలుస్తుందని, ఆపై 2030 నాటికి ప్రపంచమంతటికీ విస్తరిస్తుందని వీహెచ్ పీ నేత అశోక్ సింఘాల్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తనకు సాయిబాబా చెప్పారని అన్నారు. తాను గతంలో సత్యసాయిబాబా ఆశ్రమంలో ఉన్న సమయంలో, 2020 వచ్చేసరికి యావత్ భారతావని హిందూరాజ్యంగా అవతరిస్తుందని బాబా చెప్పినట్టు తెలిపారు. గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన తరువాతి క్షణమే దేశంలో ఓ విప్లవానికి నాంది పలికినట్లయిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడంతో 800 ఏళ్ల బానిసత్వానికి చరమగీతం పాడినట్లయిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ అధినేత దివంగత కె.ఎస్.సుదర్శన్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకావిష్కరణ సభలో అశోక్ సింఘాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సభలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News