: మట్టికుండలో నీరు - లీటరు రూ. 10 మాత్రమే!


సుదూర ప్రాంతాల నుంచి ఆపసోపాలు పడి పుష్కర స్నానం చేయాలని వస్తున్న యాత్రికులకు నడిరోడ్లపై చుక్కలు కనిపించాయి. అంగుళం కూడా కదలని ట్రాఫిక్ మధ్య ఇరుక్కుపోయి ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఇదే అదనుగా భావించి అందినకాడికి దోచుకునే వాళ్లు పలుచోట్ల తారసపడ్డారు. నిన్న కాళేశ్వరం వెళ్లే రహదారిపై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో, కనీసం తాగేందుకు నీరు దొరక్క ప్రయాణికులు అల్లాడిపోయారు. పరిస్థితిని గమనించిన కొందరు మట్టి కుండల్లో నీటిని తెచ్చి లీటరు రూ. 10 చొప్పున అమ్మకాలు ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లో యాత్రికులు సైతం నీటిని కొనుక్కొని తాగాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ మహదేవపూర్, కాళేశ్వరం మధ్య వాహనాలు నిలవడంతో తిండి, నీరు కరవై భక్తులు అలమటించారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇదే విధమైన పరిస్థితి కనిపించింది.

  • Loading...

More Telugu News