: మహేష్ బాబుతో వంద కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తాను: వీవీ వినాయక్
సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంద కోట్ల బడ్జెట్ తో ఓ అద్భుతమైన సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపాడు. హైదరాబాదులోని శిల్పకళావేదికపై జరిగిన ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, కథ తయారవుతోందని, అద్భుతమైన సినిమా తీస్తానని చెప్పాడు. శ్రీమంతుడు ట్రైలర్ అద్భుతంగా ఉందని, కొరటాల శివ డైలాగ్ రైటింగ్ వినూత్న శైలిలో ఉంటుందని, అయనంటే తనకు ఇష్టమని వినాయక్ తెలిపాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆకాంక్షించాడు.