: టైటిల్ బాగుంది...మహేష్ గ్లామరస్ గా ఉన్నాడు: కృష్ణ
'శ్రీమంతుడు' సినిమా టైటిల్ బాగుందని సూపర్ స్టార్ కృష్ణ తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరుగుతున్న సినిమా ఆడియో వేడుకలో సన్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ, 'శ్రీమంతుడు'లో మహేష్ చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నాడని అన్నారు. తనను 50 ఏళ్లపాటు ఆదరించిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సినిమా పాటలు బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చిందని అంతా చెబుతున్నారని, సినిమా బాగుంటుందని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కొరటాల శివ సినిమాను చాలా స్టైలిష్ గా తీశాడని ఆయన తెలిపారు. తనను ఆదరించినట్టే మహేష్ బాబును ఆదరించారని, అందుకు ధన్యవాదాలని, అలాగే సుధీర్ బాబును కూడా ఆదరించాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.