: వేర్ సేఫ్ ట్యాగ్ తో ఆడపిల్లలు భద్రం
మహిళలను ఆకాశంలో సగం...అవకాశాల్లో సగం అని పోలుస్తారు. అపారమైన ప్రతిభ ఉన్న ఆడపిల్లలు దూసుకుపోయిేందుకు ఎన్నో అడ్డంకులు. ఇంటి నుంచి బయకు వెళ్లిందంటే చాలు ఇంటిపాప ఏమైపోతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అలాంటి ఆందోళనకు ఓ సరికొత్త పరికరం ఫుల్ స్టాప్ పెట్టనుంది. 'వేర్ సేఫ్ ట్యాగ్' పేరిట మార్కెట్లో ఈ పరికరం లభ్యమవుతుంది. 'వేర్ సేఫ్ ట్యాగ్' చిన్న బటన్ లాంటి పరికరం. దీనిని యువతులు యాక్సెసరీస్ తో వినియోగించుకోవచ్చు. ఇది బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ లోని యాప్ తో అనుసంధానమై ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు దీని బటన్ ప్రెస్ చేస్తే మీరు ఎంపిక చేసిన శ్రేయోభిలాషులకు మెసేజ్ లు వెళ్లిపోతాయి. జీపీఎస్ ద్వారా మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? వంటివన్నీ తెలిసిపోతాయి. మీరు పంపిన మెసేజ్ ను రిసీవ్ చేసుకోగానే మీకు వైబ్రేషన్ ద్వారా సిగ్నల్ వస్తుంది. ఈ రకంగా ఆడపిల్లలను కాపాడుకోవచ్చని వీటిని తయారు చేసిన సంస్థ చెబుతోంది.