: తెలంగాణలో రేపటి నుంచే బోనాల పండుగ
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచే బోనాల పండుగ ప్రారంభం కాబోతుంది. గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయం నుంచి బోనాలు మొదలవనున్నాయి. రేపు ఉదయం అక్కడి ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పిస్తారు. బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆగస్టు 2,3 తేదీల్లో సికింద్రాబాద్ లో, 9,10 తేదీల్లో పాతబస్తీ ఉమ్మడి దేవాలయం, ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరుపుకుంటారని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది ఈ బోనాలలో పాల్గొంటారన్నారు.