: ఇక భరించలేనంటూ... భర్తపై టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు
ఏపీ టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత తన భర్త శివయ్యపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పద్నాలుగేళ్లు భరించానని, ఇక సహనం నశించిందని ఆమె వాపోయారు. తాను ఇంట్లో లేని సమయం చూసి ఇంటికి వచ్చి పిల్లలపై దౌర్జన్యం చేశాడని, తన గన్ మెన్, పీఏలను బెదిరించాడని పేర్కొంటూ విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 14 సంవత్సరాల కిందట ఇదే పోలీస్ స్టేషన్ లో అనిత, శివయ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే అనిత భర్తకు విడాకుల నోటీసు పంపారు. దాంతో ఆగ్రహానికి గురైన శివయ్య ఎమ్మెల్యే ఇంటికి వచ్చి దౌర్జన్యానికి ప్రయత్నించాడు. బలవంతంగా పిల్లలను, ఆస్థి పత్రాలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతన్ని గన్ మెన్ లు అడ్డుకోవడంతో తిరగబడ్డాడు.