: భారత్-పాక్ సైనికులు ఈసారి ఈద్ కు స్వీట్లు పంచుకోలేదట!


మిగతా రోజుల్లో ఎలా ఉన్నా భారత్- పాకిస్థాన్ సైనికులు ప్రతి ఏడాది రంజాన్ పండుగ నాడు సరిహద్దు ప్రాంతమైన వాస్తవాధీన రేఖ వద్ద మిఠాయిలు పంచుకోవడం ఆనవాయతీగా వస్తోంది. కానీ ఈసారి ఈద్ కు అలా జరగలేదు. కొన్ని రోజుల నుంచి వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘన, భారత్ డ్రోన్ పాక్ లోకి ప్రవేశించిందంటూ పాక్ దళాలు దాన్ని పేల్చివేయడం వంటి పలు సంఘటనల నేపథ్యంలో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే, ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకోలేదని అమృత్ సర్ సెక్టార్ కు చెందిన భారత సరిహద్దు దళ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఫారూఖీ తెలిపారు. మిఠాయిలు పంచుకునే విషయమై చర్చించగా పాక్ రేంజర్స్ నుంచి సానుకూల స్పందన రాలేదని, అందుకే విరమించుకున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News