: కడప పోలీసుల అదుపులో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్


ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్ లు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన కడప పోలీసులు... తాజాగా జయపాల్ సింగ్ అనే అంతర్జాతీయ స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అతనితో పాటు లక్ష్మణ్, పింకూశర్మ అనే ఇద్దరు స్మగ్లర్లను కూడా అరెస్టు చేశామని చెప్పారు. ఈ నెల 14న హర్యానాలో వారందిరిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. త్వరలో కడపకు తీసుకువస్తామని, దక్షిణాది స్మగ్లర్లతో జయపాల్ కు సంబంధాలున్నాయని ఎస్పీ నవీన్ గులాటి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News