: పాలమూరు ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం: వైసీపీ ఎంపీ మేకపాటి


తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఎట్టకేలకు తన వైఖరిని స్పష్టం చేసింది. ఏపీకి నీటి లభ్యతను ప్రశ్నార్థకం చేయనున్న సదరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ ఎంపీలతో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటులో పార్టీ వైఖరిపై భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట, ఓటుకు నోటు కేసు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలను పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News