: శాంతాక్రజ్ ద్వీపంలో పెను భూకంపం... సోలొమన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు
శాంతాక్రజ్ ద్వీపంలో కొద్దిసేపటి క్రితం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 7.5గా నమోదైందని అమెరికా జియలాజికల్ సర్వే పేర్కొంది. భారీ భూకంపం నేపథ్యంలో శాంతాక్రజ్ ద్వీపానికి సమీపంలోని సోలొమన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.