: రంజాన్ స్పెషల్... 'సలాం' చేస్తున్న బాహుబలి, భల్లాలదేవ


బాహుబలి సినిమా యూనిట్ సందర్భోచితంగా వ్యవహరించింది. రంజాన్ ను పురస్కరించుకుని 'బాహుబలి' పోస్టర్ ను విలక్షణ రీతిలో రూపొందించి, విడుదల చేసింది. బాహుబలి పాత్రధారి ప్రభాస్, భల్లాలదేవ పాత్రధారి రానా ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో అభివాదం చేయడం ఆ పోస్టర్లలో కనిపిస్తుంది. పైగా టైటిల్ ను ఉర్దూలోనూ రాశారు. ఈ సందర్భంగా బాహుబలి యూనిట్ ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకువెళుతోంది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు అచ్చెరువొందారు.

  • Loading...

More Telugu News