: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఈ నెల 24కి వాయిదా


ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి. విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. కాల్ డేటా వివరాలను ఈ నెల 24న కోర్టుకు సమర్పించాలని సర్వీస్ ప్రొవైడర్లను కోర్టు ఆదేశించింది. కాగా, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. సర్వీస్ ప్రొవైడర్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని అన్నారు. సిట్ కు సమాచారం, కాల్ డేటాను అందించలేదని వాదించారు. ఆ వెంటనే రిలయన్స్ తరపు న్యాయవాది తాళ్ల వీరభద్రం వాదనలు వినిపించారు. సిట్ కు ఎలాంటి సమాచారం, కాల్ డేటా ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. తమ అనుమతి లేకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని స్పష్టం చేసిందని వివరించారు. తాము రెండు రాష్ట్రాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News