: రాణించిన టాపార్డర్...టీమిండియా 178/5
జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న తొలి టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ రాణించింది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు మురళీ విజయ్ (34), కెప్టెన్ రహానే (33) శుభారంభం ఇవ్వడానికి తోడు, టీట్వంటి స్పెషలిస్ట్ రాబిన్ ఊతప్ప (39) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో పోఫు మూడువికెట్లు తీసి రాణించగా, ఒక వికెట్ తీసి క్రీమర్ సహకారమందించాడు. దీంతో జింబాబ్వే జట్టు 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది.