: గుంటూరు జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల ఉదంతం
ఏపీలోని మరో జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాల్లో ఈ ఉదంతం బయటికి వచ్చింది. రెవెన్యూ ఉద్యోగులే నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలపై నకిలీ ఎమ్మార్వో, ఆర్డీవో సంతకాలు చేశారని తెలిసింది. వెంటనే నకిలీ సంతకాలు చేసిన వారిపై పెదకూరపాడు ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ పాసుపుస్తకాల స్కాం మరువక ముందే గుంటూరు జిల్లాలో కూడా అలాంటి స్కాం బయటపడటం గమనార్హం.