: వృద్ధాశ్రమంలో పుట్టినరోజు జరుపుకున్న సీనియర్ నటుడు రంగనాథ్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడు రంగనాథ్ ది ప్రత్యేక స్థానం. హీరోగానూ, క్యారెక్టర్ నటుడిగానూ ఆయన తనదైన ముద్ర వేశారు. శుక్రవారం ఆయన 70వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఆడంబరాలకు పోకుండా, పాతబోయిన్ పల్లిలోని 'అమ్మ వృద్ధాశ్రమం'లో కేక్ కోశారు. ఈ కార్యక్రమంలో రంగనాథ్ మిత్రుడు శేషు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఆశ్రమవాసుల మధ్య బర్త్ డే జరుపుకోవడం ఆనందంగా ఉందని రంగనాథ్ వ్యాఖ్యానించారు. అనంతరం, ఇప్పటి సినిమాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చారాయన. 'హీరో'కి అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో మహిళలు 'సినిమా'కు దూరమవుతున్నారని తెలిపారు. ఎక్కువగా యువతను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారని పేర్కొన్నారు.