: రాజీవ్ హత్య కేసు దోషికి సినిమా ఛాన్స్!


అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్ అలియాస్ అరివుకు మాత్రం అదృష్టం జైలు తలుపు తట్టింది. ఉరిశిక్ష అంశంతో జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు జననాథన్ తెరకెక్కించే సినిమాలో అతనికి నటించే అవకాశం వచ్చింది. ఇటీవల అతని తల్లి అర్పుతమ్మాళ్ తో కలసి దర్శకుడు వెల్లూర్ కేంద్ర కారాగారంలో అరివును కలుసుకున్నారు. తాను ఓ సినిమా తీయబోతున్నానని, నటించే ఆసక్తి ఉంటే తన చిత్రంలో అవకాశం ఇస్తానని చెప్పారు. ఇదే సమయంలో కథ కూడా విన్న అరివు త్వరలోనే తన నిర్ణయం చెబుతానన్నాడని జననాథన్ తెలిపారు. గతంలో తాను తీసిన 'పోరమ్ పొక్కు ఎన్ గిర పొదువుడమై' చిత్రం గురించి మాట్లాడాడని, అందులో డైలాగులు కూడా చెప్పాడన్నారు. అలాంటి సినిమాలు ఉరిశిక్ష విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిని మారుస్తాయని అరివు అన్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News