: కేసీఆర్ కు అప్పుడు తెలియదా?: మాజీ మంత్రి సబిత సూటి ప్రశ్న


రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం లేనట్టు ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కావాలని డిమాండ్ చేసినప్పుడు కేసీఆర్ కు ఈ ప్రాజెక్టు డిజైన్ సరికాదని తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసని ఆమె చెప్పారు. చేవెళ్లకు నీరందకుండా డిజైన్ మారిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును ప్రజలు అంగీకరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే దుగ్ధతోనే కేసీఆర్ డిజైన్ మార్పు అంటున్నారని ఆమె విమర్శించారు. పార్టీలకు మార్కులు ప్రధానం కాదని, ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలు పరిరక్షించాలని ఆమె కేసీఆర్ కు సూచించారు.

  • Loading...

More Telugu News