: శ్రీనగర్ లో ఉద్రిక్తత... పాక్, ఐసిస్ జెండాల ప్రదర్శన
జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ఉద్రిక్తతలు తలెత్తాయి. పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో శ్రీనగర్ లో భారీ ఎత్తున ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేర్పాటు వాదులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను చేతబట్టి, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.