: బారు ఓపెనింగ్ కు వచ్చి కారు ప్రమాదంలో చిక్కుకున్న గాయకుడు!


ఒకే ఒక్క పాటతో ప్రపంచవ్యాప్త క్రేజ్ ను సంపాదించుకున్న దక్షిణ కొరియా గాయకుడు 'సై' చైనాలో ఓ కారు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. సై ప్రయాణిస్తున్న రోల్స్ రాయిస్ కారు ఓ బస్సును ఢీకొట్టింది. ఆ సమయంలో కారు చాలా వేగంగా ప్రయాణిస్తోంది. బస్సును ఢీకొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతిన్నది. అయితే, గాయకుడు సైకి ఎలాంటి గాయాలు కాలేదు. ఝెజియాంగ్ ప్రావిన్స్ లోని హాంగ్ ఝౌ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ బారు ఓపెనింగ్ పార్టీ కోసం సై నగరానికి విచ్చేశాడు. సై విమానాశ్రయం నుంచి హోటల్ కు వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News