: చంద్రబాబునాయుడి ఓఎస్డీని నటుడు అనుకుని పొరబడ్డారు!


మనిషిని పోలిన మనుషులు ఉండడం సహజం! తాజాగా, రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద ఇలాగే ఓ వ్యక్తిని సినీ నటుడనుకుని భక్తులు పొరబడ్డారు. వివరాల్లోకెళితే... సీఎం చంద్రబాబునాయుడికి ఓఎస్డీగా పనిచేస్తున్న వెంకయ్య చౌదరి ఘాట్ వద్ద ఉండగా ఈ విచిత్ర ఘటన జరిగింది. ఆయన టాలీవుడ్ నటుడు షఫీ పోలికలతో ఉండడంతో ప్రజలు ఆసక్తిగా దగ్గరకు వచ్చారు. నటుడే అనుకుని, మీరు ఖడ్గం, ఛత్రపతి సినిమాల్లో నటించారు కదా? అని అడిగారు. దానికాయన చిరునవ్వుతో తన ఐడెంటిటీ వివరించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అచ్చు షఫీలా ఉన్నాడే అనుకుంటూ వెనుదిరిగారు. ప్రజలే కాదు మీడియా ప్రతినిధులు కూడా ఆయనను షఫీగానే భావించారు. దగ్గరకు వెళ్లి ఆయన ఫొటోలు తీశారు. ఆనక విషయం తెలుసుకుని విస్మయం చెందారు.

  • Loading...

More Telugu News