: న్యాయ వ్యవస్థకు కుల, మతాలు ఆపాదించడం పద్ధతి కాదు: టీ.టీడీపీ ఎమ్మెల్యేలు
న్యాయవ్యవస్థకు టీఆర్ఎస్ నేతలు కులం, మతం, ప్రాంతాలు ఆపాదించడం సరికాదని టీ.టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్ లు సూచించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారిస్తున్న జడ్జిలు ఆంధ్రా వారు కాదన్నారు. అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వానికి భయమెందుకని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే... స్పీకర్ ముందే మంత్రిగా విధులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిదా? అని అడుగుతున్నామన్నారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.