: ఫలించిన గుత్తా జ్వాల పోరు... రియో ఒలింపిక్స్ టాప్ స్కీంలో గుత్తా జోడికి చోటు
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల పోరాటం ఫలించింది. బాడ్మింటన్ సమాఖ్య, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ లపై వరుస విమర్శలు గుప్పించిన జ్వాల దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీశారు. మెరుగ్గా రాణిస్తున్న తమకు ఏమాత్రం ప్రాధాన్యం కల్పించకపోగా, అంతంతమాత్రంగా ఆడుతున్నవారికి అంతర్జాతీయ టోర్నీల్లో ప్రాధాన్యం లభిస్తోందని గుత్తా జ్వాల ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. గుత్తా జ్వాల ఆరోపణల నేపథ్యంలో మొత్తం పరిస్థితిపై సమీక్ష జరిపిన బాడ్మింటన్ సమాఖ్య... గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పల జోడీకి రియో ఒలింపిక్స్ టాప్ స్కీం జాబితాలో చోటు కల్పించింది. తద్వారా ఒలింపిక్స్ లో జ్వాల, పొన్నప్పల ఖర్చులను భరించేందుకు బాడ్మింటన్ సమాఖ్య సంసిద్ధత వ్యక్తం చేసినట్లైంది.