: ఆ మహిళా కండక్టర్ బస్సులో నుంచి ఎందుకు దూకిందంటే..!


పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న బి.పద్మావతి అనే మహిళా కండక్టర్ ఈ ఉదయం బస్సులో నుంచి కిందకు దూకి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆమె డ్యూటీ చేస్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించిన ఆర్టీసీ అధికారులు, ఇచ్చిన టికెట్ల కన్నా, బస్సులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని గుర్తించి, చార్టులో రిమార్కులు రాయడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఎల్ అండ్ డీ కాలనీ వద్ద జరుగగా, బస్సులో 18 మంది ప్రయాణికులు అధికంగా ఉన్నారని గమనించిన అధికారులు, కండక్టర్ విధులు సరిగ్గా నిర్వర్తించలేదంటూ రిమార్కు రాశారు. దీంతో మనస్తాపానికి గురైన పద్మావతి బస్సునుంచి దూకి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News