: ప్రత్యూష కేసులో హైకోర్టు విచారణ... తండ్రి జీతంలో సగం ఇవ్వాలని ఆదేశం


హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన ప్రత్యూష కేసులో ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఆమె పెదనాన్న అయిన డిప్యూటీ కలెక్టర్ సతీష్ చంద్ర, పెద్దమ్మ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. వారి నుంచి కుటుంబ సభ్యుల వివరాలు, బాలిక ఆస్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రత్యూష తండ్రి రమేశ్, మేనమామ న్యాయవాది సాయి ప్రతాప్ ను ఈ నెల 20న కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఇక బాలిక పిన్ని చాముండేశ్వరి తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సవతి తల్లి హింసిస్తుంటే బంధువులు, చుట్టుపక్కల వారు స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ప్రత్యూష సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగించిందని పేర్కొంది. తను ఎక్కడ ఉండాలని కోరుకుంటే అక్కడే ఉంచాలని, తండ్రి జీతంలో సగం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే ప్రత్యూష డిశ్చార్జ్ అయ్యాక అవసరమైతే తాము మాట్లాడతామని, వీలైతే సోమవారం కోర్టుకు తీసుకురావాలని చెప్పింది.

  • Loading...

More Telugu News