: సచివాలయం ముందు ‘కేసీఆర్ డౌన్ డౌన్’ నినాదాలు... నిరసనలతో హోరెత్తించిన టీ కాంగ్రెస్
మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుల పట్ల తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైఖరిని నిరసిస్తూ టీ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య తదితరులు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని సచివాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన నేతలు సెక్రటేరియట్ ముందు నడిరోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ‘కేసీఆర్ డౌన్ డౌన్’ నినాదాలతో కాంగ్రెస్ నేతలు హోరెత్తించారు. మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం, వారి ఉద్యోగాలనే పీకేసేందుకు యత్నిస్తోందని నేతలు మండిపడ్డారు. కార్మికులకు తాము అండగా ఉంటామని ప్రకటించారు.