: భయంతో బస్సులో నుంచి దూకిన మహిళా కండక్టర్!
పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు వస్తున్న బస్సులో నుంచి మహిళా కండక్టర్ అకస్మాత్తుగా దూకిన ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు బస్సును ఆపిన ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కండక్టర్ భయంతో దూకినట్టు తెలిసింది. దాంతో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కండక్టర్ బస్సులో నుంచి దూకడానికి గాల కారణాలు తెలియరాలేదు.