: బాహుబలి రికార్డులను అందుకోలేకపోతే... చిరంజీవి 150వ సినిమా చేయడం వేస్ట్: వర్మ సంచలన వ్యాఖ్యలు
వివాదాలకు మారుపేరైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశారు. 150వ సినిమాకు చిరంజీవి రెడీ అయిన వేళ... వర్మ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించేవే. దేశ చలనచిత్ర రంగంలో రికార్డుల మోత మోగిస్తున్న 'బాహుబలి' రికార్డులను అందుకోలేకపోతే, చిరంజీవి తన 150వ చిత్రం చేయడం శుద్ధ దండగ అని వర్మ ట్వీట్ చేశారు. రికార్డులను బద్దలు కొట్టే పరిస్థితి లేదనిపిస్తే, ఇకపై చిరంజీవి నటించకపోవడమే బెస్ట్ అని చెప్పారు. లేకపోతే, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎలాంటి పేరు సంపాదించుకున్నారో, 150వ సినిమా కూడా చిరంజీవికి అలాంటి చేదు అనుభవాలనే మిగిలిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.