: ఒక్క ఎలుక... ఒకేసారి 80 మందిని గాయపర్చింది!


ఒక్క ఎలుక ఒకేసారి 80 మందిని ఎలా గాయపర్చిందని అనుమానం వచ్చిందా? నిజమే, ఎలుక అసలు కరవనే లేదు. కానీ 80 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... పవిత్ర రంజాన్ మాసం కావడంతో మెరాకోలోని ఓ మసీదులో మహిళలంతా ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఓ మూషికం ప్రవేశించింది. దానిని చూసిన ఓ మహిళ భయంతో అరవడం ప్రారంభించింది. దీంతో ప్రార్థనల్లో ఉన్నవారు గందరగోళానికి గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక, భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఒకర్ని ఒకరు తోసుకోవడం, తొక్కిసలాట కారణంగా 80 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో కొందరికి ఎముకలు విరిగిపోయాయి, ఇంకొందరు మూర్ఛపోయారు. వీరిలో ఓ నిండు గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News