: పది లక్షలిచ్చి చేతులు దులిపేసుకుంటానంటే ఊరుకోం: బాబుకు వీహెచ్ హెచ్చరిక


గోదావరి పుష్కరాల్లో తొలి రోజు ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతోనే చేతులు దులిపేసుకుంటానంటే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ డబ్బును పుష్కరాలకు విడుదల చేసిన నిధులలోంచి వాడాలని ఆయన సూచించారు. చంద్రబాబు పబ్లిసిటీ చేసుకోవడంపై కాకుండా ప్రజా శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. పుష్కరాల్లో చంద్రబాబునాయుడు అన్నీ తానై చేస్తున్నాడని, ఒక్కడే అన్నీ చేయడానికి ఇదేమీ ఆటకాదని, అందరికీ పనులు అప్పగించాలని వీహెచ్ చెప్పారు. పది మంది పని చేస్తే తప్పులు జరగవని, అన్నీ ఒక్కరే చేస్తే సవాలక్ష తప్పులు జరుగుతాయని ఆయన సూచించారు. పుష్కరాల్లో ఎవర్ని ఏమి అడిగినా బాబును అడగాలంటున్నారని, అది సరికాదని, అధికారులకు బాధ్యతలు ఇవ్వాలని, వాటిని సీఎం పర్యవేక్షించాలని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News