: ఇక ఏ జట్టునైనా ఓడిస్తాం: తమీమ్ ఇక్బాల్


ఇక ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడిస్తామని బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తెలిపాడు. భారత్, సౌతాఫ్రికాలపై సిరీస్ విజయాలు సాధించడంతో బంగ్లా క్రికెటర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపైందని తమీమ్ ఇక్బాల్ తెలిపాడు. తాజా విజయంతో ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగల సామర్థ్యం తమకుందని తమీమ్ చెప్పాడు. రెండో వన్డేలో సౌమ్య సర్కార్ జట్టుకు మంచి విజయాన్ని అందించాడని, బౌలర్లు అంచనాలకు మించి రాణించారని తమీమ్ వెల్లడించాడు. అంతర్జాతీయ వేదికలపై కూడా బంగ్లా జట్టు రాణిస్తుందని, బలమైన ప్రత్యర్థును ఓడిస్తుందని తమీమ్ ఇక్బాల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికాపై సిరీస్ విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదని తమీమ్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News